‘సామజవరగమన’ హిట్టు కొట్టాడు కానీ.!

- July 01, 2023 , by Maagulf
‘సామజవరగమన’ హిట్టు కొట్టాడు కానీ.!

శ్రీవిష్ణు సినిమాలంటే అభిమానుల్లో ప్రత్యేకమైన అభిప్రాయం వుంది. కంటెంట్ రిచ్ మూవీస్‌కే శ్రీ విష్ణు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడన్న ఒపీనియన్ వుంది. ఆ ఒపీనియన్‌తోనే సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా శ్రీ విష్ణు సినిమాలకి మంచి ఆదరణ దక్కుతుంటుంది. 
తాజాగా ‘సామజవరగమన’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీ విష్ణు. హీలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా మంచి పేరే తెచ్చుకుంది.
యాక్షన్ బ్లాక్ బస్టర్‌ అవుతుందనుకున్న ‘స్పై’ రిజల్ట్ బెడిసికొట్టడంతో, ‘సామజవరగమన’ శ్రీ విష్ణుకి కలిసొచ్చింది. గురువారం ఈ సినిమా రిలీజైంది. లాంగ్ వీకెండ్ కావడం, పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో, శ్రీ విష్ణు సినిమా హిట్ లిస్టులో చేరిపోయింది ఇప్పటికయితే.
అయితే ఈ హిట్టు నిలబడాలంటే, సోమవారం కూడా సినిమా నిలదొక్కుకోవాలి. ఒకవేళ అదే జరిగితే, ‘సామజవరగమన’ పెద్ద హిట్ అయిపోవడం ఖాయం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com