‘గుంటూరు కారం’ జోరందుకున్న షూటింగ్.!
- July 01, 2023
మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ ‘గుంటూరు కారం’ సినిమా విషయంలో రకరకాల అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇంకేముంది సినిమా ఆగిపోయిందన్నారు.
ఒక్కొక్కరుగా టెక్నీషియన్లు ప్రాజెక్టు నుంచి అవుట్ అయిపోతున్నారన్న ప్రచారం జరిగింది. ఆ ప్రచారాలన్నింటినీ ఖండించుకుంటూ వచ్చింది చిత్ర యూనిట్.
హీరోయిన్ పూజా హెగ్ధే అయితే, అవుట్ అయిపోయిన మాట వాస్తవమే. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.
ఇక, ప్రస్తుతం షూటింగ్ పనులు జోరందుకున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ‘గుంటూరు కారం’, మూడో షెడ్యూల్ షూటింగ్ పనుల్లో బిజీ అయిపోయింది.
వీలైనంత త్వరగా ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారట. ఏది ఏమైనా ఆ ప్లానింగ్‌లో ఎలాంటి మార్పు రాకూడని టీమ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి ఎలాగైనా ఈ సినిమాని రిలీజ్ చేయాలన్నదే గురూజీ, మహేష్ యోచన. ఆ దిశగానే షూటింగ్ పనులు వేగంగా పూర్తి చేసి, నిర్మాణానంతర పనులు మొదలెట్టబోతున్నారట.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







