తెలంగాణలో మరో 8 మెడికల్ కాలేజీలు
- July 05, 2023
హైదరాబాద్: తెలంగాణలో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రానున్నాయి. జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కాలేజీల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త కాలేజీలు వస్తే ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. దీని ద్వారా దేశంలోనే అరుదైన రికార్డ్ సొంతం చేసుకోనుంది. 9ఏళ్లలో 29 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాగా రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 10వేలకు చేరువ కానున్నాయి.
”జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అన్న సీఎం కేసీఆర్ లక్ష్యం సాకారం కానుంది. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. మొత్తం 34 మెడికల్ కాలేజీలతో దేశంలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకోనుంది తెలంగాణ. ఈ తొమ్మిదేళ్ల కాలంలో 29 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 10వేలకు చేరువ కానున్నాయి. మారుమూల ప్రాంతాలకు సైతం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువయ్యాయి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వైద్య విద్య విప్లవమిది. సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు” అని మంత్రి హరీశ్ అన్నారు.
తాజా వార్తలు
- బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు
- భారత్‌లో 38,500 దాటిన రిజిస్టర్డ్ డ్రోన్ల సంఖ్య
- సౌదీలోని కొన్ని నగరాల్లో తగ్గిన చలి..!!
- ఖతార్ లో రమదాన్ క్యాలెండర్.. నెలంతా సందడే..!!
- ఒమానీ పౌరులకు అజర్బైజాన్ గుడ్ న్యూస్..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై పరిమితులు..!!
- బహ్రెయిన్ పౌరులకే పబ్లిక్ ఫార్మసీలు..!!
- దుబాయ్ లో పెయిడ్ పార్కింగ్ అవర్స్ రివైజ్డ్..రెండు గంటలు ఫ్రీ..!!
- సినీ నటి ప్రత్యూష మృతి కేసు..సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- భారత్ లోనే కాస్ట్లీ ఎయిర్‌పోర్ట్‌గా హైదరాబాద్..









