బ్యూటీ పార్లర్స్ మూసేయాలి: తాలిబన్ ప్రభుత్వం హెచ్చరిక
- July 05, 2023
కాబుల్: అఫ్గానిస్థాన్ లో తాలిబన్ల ప్రభుత్వం వచ్చినప్పటినుంచి బాలికలు, యువతులు, మహళలపై అంతులేని ఆంక్షలు విధిస్తు జీవితాలను దర్భురం చేస్తున్నారు. బాలికల విద్యపై ఆంక్షలు, యువతులు యూనివర్శిటీల్లో చదవకూడదని, మీడియాలో పనిచేసే ఉద్యోగినులు మొహం కనిపించకుడదని..జర్నలిస్టు ముఖాలు కప్పుకుని న్యూస్ చదవాలని ఇలా చెప్పుకుంటు పోతే ఆడపుట్టుకమీదనే అంతులేని ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు కొనసాగుతున్న క్రమంలో తాలిబన్ ప్రభుత్వం మరో సారి హెచ్చరికలు జారీ చేసింది.ఈసారి మహిళా బ్యూటీ పార్లర్లపై ఉక్కుపాదం మోపింది. బ్యూటీ పార్లర్లు మూసేయాలని హుకుం జారీ చేసింది.
మంగళవారం (జులై 4,2023)న ప్రభుత్వ ప్రతినిథి ఆదేశాలు జారీ చేశారు. అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ లో మహిళా బ్యూటీ సెలూన్‌లపై తాలిబన్ ప్రభుత్వం నిషేధం విధించింది. బ్యూటీ పార్లర్లు మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు. ఇక నుంచి మహిళలు బ్యూటీ పార్లర్లు నడపకూడదని మంత్రి మహ్మద్ అకిఫ్ మహజర్ కాబుల్ నగర మున్సిపాలిటి కి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలపై మేకప్ ఆర్టిస్టులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వృత్తిపై ఇటువంటి ఆంక్షలా ఎలా బత్రకాలి అంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఈ ఆదేశాలు వెలువడిని క్రమంలో ఆయా బ్యూటీ పార్లర్లకు నోటీసులు జారీ చేయబడతాయి. నెల రోజుల్లో వాటిని మూసివేయాలి. ఆ తరువాత వాటిని తెరవకూడదు. మూసివేసినట్లుగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. ఈ ఆదేశాలు కాదని ఎవరన్నా పార్లర్లు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 2021 ఆగస్టులో అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు ఇష్టానుసారంగా ప్రజలపై మరి ముఖ్యంగా మహిళలపై వారి స్వేచ్ఛపై అంతులేని ఆంక్షలు విధిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







