పర్యాటక ప్రాంతాంగా షార్జా 'బరీడ్ విలేజ్'
- July 06, 2023
యూఏఈ: ఎడారిలో దాదాపు సగం వరకు కప్పబడిన షార్జా విలేజ్ ‘బరీడ్ విలేజ్’ ప్రముఖ పర్యాటక కేంద్రంగా మలిచేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. సుప్రీమ్ కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు అయిన హిస్ హైనెస్ షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి, అల్ మేడమ్లోని పురాణ 'బరీడ్ విలేజ్'ని సంరక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. సందర్శకులు, పర్యాటకుల కోసం ఘురైఫా గ్రామాన్ని సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అల్ మేడమ్కు నైరుతి దిశలో 2కిమీ దూరంలో ఉన్న ఈ పాడుబడిన గ్రామంలో రెండు వరుసల ఒకే రకమైన ఇళ్లు, రోడ్డు చివర ఒక మసీదు ఉన్నాయి. ఇది 'బరీడ్ విలేజ్' పేరు పొందింది. ఇక్కడున్న వారికి ప్రభుత్వం కొత్త ఇళ్లను అందించడంతో 1999లో ఇక్కడి నివాసితులు దానిని విడిచిపెట్టారు. అనంతరం కాలంలో ఇసుక పరిమాణం పెరగడంతో గ్రామం మొత్తం ఇసుకతో కప్పబడింది.
తాజా వార్తలు
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్







