బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్‌లైన్‌గా ఎమిరేట్స్ రికార్డు
- June 30, 2026
దుబాయ్: ఎమిరేట్స్ స్కైకార్గో మరో కీలక మైలురాయిని చేరుకుంది. ప్రయాణికుల కోసం ఉపయోగించే బోయింగ్ 777-300ER విమానాన్ని కార్గో విమానంగా (Boeing 777-300ERSF) మార్పు చేసి వాణిజ్య సేవల్లో ప్రవేశపెట్టిన ప్రపంచంలోని తొలి ఎయిర్‌లైన్ కార్గో సంస్థగా ఎమిరేట్స్ నిలిచింది.
A6-EBK రిజిస్ట్రేషన్ కలిగిన ఈ విమానం హాంకాంగ్ నుంచి దుబాయ్‌కు 100 టన్నులకు పైగా సరుకుతో తొలి వాణిజ్య ప్రయాణాన్ని ప్రారంభించింది.
కొత్తగా మార్పు చేసిన ఈ బోయింగ్ 777-300ERSF విమానం 100 టన్నుల వరకు సరుకు మోయగల సామర్థ్యంతో పాటు 811 క్యూబిక్ మీటర్ల కార్గో స్థలాన్ని కలిగి ఉంది. ఇది సాధారణ బోయింగ్ 777-F కార్గో విమానంతో పోలిస్తే 25 శాతం అధిక కార్గో సామర్థ్యాన్ని అందిస్తుంది.
అదేవిధంగా, ఈ విమానంలో 47 ప్యాలెట్ స్థానాలు ఉండటంతో, బోయింగ్ 777-Fతో పోలిస్తే 10 అదనపు ప్యాలెట్లను లోడ్ చేసుకునే వీలుంది. దీంతో ఈ-కామర్స్ వస్తువులు వంటి అధిక పరిమాణంలో ఉండే సరుకుల రవాణాకు ఇది మరింత అనుకూలంగా ఉంటుందని ఎమిరేట్స్ తెలిపింది.
ఎమిరేట్స్ స్కైకార్గో డివిజనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బద్ర్ అబ్బాస్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న కార్గో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని పాత బోయింగ్ 777-300ER ప్రయాణికుల విమానాలను కార్గో విమానాలుగా మారుస్తున్నామని చెప్పారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా సరుకుల రవాణా సామర్థ్యం మరింత పెరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో 40కిపైగా గమ్యస్థానాలకు మాత్రమే కార్గో సేవలు అందించిన ఎమిరేట్స్ స్కైకార్గో, ప్రస్తుతం 62 గమ్యస్థానాలకు తన కార్గో నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు వెల్లడించింది.
2026 మార్చి నుంచి ఇప్పటివరకు ఐదు బోయింగ్ 777-F కార్గో విమానాలు మరియు ఈ కొత్తగా మార్పు చేసిన ఒక బోయింగ్ 777-300ERSFతో కలిపి మొత్తం ఆరు కొత్త కార్గో విమానాలు ఎమిరేట్స్ స్కైకార్గో బృందంలో చేరాయి.
విస్తరణ ప్రణాళికలో భాగంగా 2026 డిసెంబర్ నాటికి మరో ఐదు బోయింగ్ 777-F కార్గో విమానాలు, మరో ఒక బోయింగ్ 777-300ERSFను, అలాగే 2027లో మరో మూడు మార్పు చేసిన బోయింగ్ 777-300ERSF విమానాలను సేవల్లోకి తీసుకురానున్నట్లు ఎమిరేట్స్ ప్రకటించింది.
ఈ విస్తరణ ద్వారా ప్రపంచ వాణిజ్యానికి మరింత మద్దతు అందిస్తూ, ఆరు ఖండాల్లోని వ్యాపార కేంద్రాలను దుబాయ్ హబ్‌తో అనుసంధానించే లక్ష్యంతో ఎమిరేట్స్ స్కైకార్గో ముందుకు సాగుతోంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







