తానా మహా సభలకు ముఖ్యఅతిథిగా వెంకయ్య నాయుడు
- July 06, 2023
హైదరాబాద్: అమెరికా ఫిలడెల్ఫియాలో నిర్వహించనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 23వ మహా సభలకు భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ మహా సభలు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కాన్ఫరెన్స్ హాల్లో జులై 7 నుంచి 9 వరకు జరగనున్నాయి. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ప్రముఖులకు శ్రీ వెంకయ్య నాయుడు అమెరికా కాలమానం ప్రకారం ఈనెల 7న సాయంత్రం తానా పురస్కారాలను అందజేయనున్నారు. ఈనెల 8న ఉదయం తానా మహా సభలను వెంకయ్య నాయుడు ప్రారంభిస్తారు. అనంతరం ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం తానా సదస్సును ఉద్దేశించి కీలక ఉపన్యాసం చేస్తారు. అమెరికా కాలమానం ప్రకారం ఈ నెల పదో తేదీ సాయంత్రం వాషింగ్టన్ డిసి లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి శ్రీ వెంకయ్య నాయుడు ప్రసంగిస్తారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







