అల్ అష్ఖారాలో పర్యాటక కార్యకలాపాలు ప్రారంభం
- July 06, 2023
ఒమన్: అల్ అష్ఖారా పబ్లిక్ పార్క్లో హెరిటేజ్, టూరిజం శాఖ మంత్రి సలీం బిన్ మహ్మద్ అల్ మహ్రూఖీ ఆధ్వర్యంలో అల్ అష్ఖారా వాతావరణ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు సందర్శకులను ఆకర్షించడానికి ఇది తోడ్పాటు అందిస్తుందని ఈ సందర్భంగావారు పేర్కొన్నారు. ఇది ముఖ్యంగా వేసవిలో దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుందన్నారు. ఫోరమ్ స్థానిక పర్యాటకాన్ని మెరుగుపరచడం, జాతీయ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంతోపాటు ఈవెంట్ల వైవిధ్యం, సమగ్రత ద్వారా సాంస్కృతిక మరియు ఆర్థిక అంశాలతో ఏకీకృతం చేయడానికి, పర్యాటక కార్యకలాపాలను కొనసాగించడానికి శాశ్వత సైట్లను సిద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. వీటితోపాటు వినోదం, బీచ్ గేమ్స్ కార్నర్, సాంస్కృతిక, ఇతర కార్యకలాపాలు ఉంటాయని, గాలిపటాల పండుగ నిర్వహించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







