జీవవైవిధ్యం, సముద్ర కాలుష్య ఒప్పందంపై సంతకాలు

- July 06, 2023 , by Maagulf
జీవవైవిధ్యం, సముద్ర కాలుష్య ఒప్పందంపై సంతకాలు

బహ్రెయిన్: జీవవైవిధ్యం, సముద్ర కాలుష్యంపై కుదిరిన అవగాహన ఒప్పందం (MOU)పై బహ్రెయిన్-యూకే సంతకాలు చేశాయి.  క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  చమురు, పర్యావరణ మంత్రి తరపున విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ, వాతావరణ వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మహమ్మద్ బిన్ ముబారక్ బిన్ డైనా మరియు యూకే డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ గ్రీన్ సంతకం చేశారు.  పర్యావరణం, సముద్ర జీవులు, వాతావరణ మార్పు శాస్త్రాలు, సముద్ర ఆహార భద్రత, జీవవైవిధ్యం మరియు కాలుష్యం నుండి భద్రతను పర్యవేక్షించడంలో సహకార రంగాలను అన్వేషించడానికి వీలు కల్పించడం ద్వారా బహ్రెయిన్‌లోని సుప్రీం కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ (SCE), బ్రిటన్‌కు చెందిన సెఫాల మధ్య ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడం ఈ ఎమ్ఒయు లక్ష్యం. ఎమ్ఓయూ కింద ఇరు పక్షాలు తమ కేడర్‌లు, ప్రయోగశాలల సామర్థ్యాలను పెంపొందించుకోవడం, అభివృద్ధి చేయడంతో పాటు, శాస్త్రీయ, సాంకేతిక సమాచారం, సందర్శనలు, శిక్షణ, పరిశోధన మరియు సహకార ప్రాజెక్టులను కూడా మార్పిడి చేసుకోగలుగుతాయని  ఈ సందర్భంగా తెలిపారు.  HRH ప్రిన్స్ సల్మాన్ యూకే పర్యటన సందర్భంగా ఈ సమావేశం జరిగింది. లండన్‌లోని బహ్రెయిన్ రాయబారి షేక్ ఫవాజ్ బిన్ మహ్మద్ అల్ ఖలీఫా, బహ్రెయిన్‌లోని బ్రిటన్ రాయబారి రోడ్డీ డ్రమ్మండ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. వారు ప్రపంచ శాంతి, భద్రతపై ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాల ప్రభావాన్ని, అలాగే మధ్యప్రాచ్య వివాదాలు మరియు సంక్షోభాలు, ఆయా ప్రాంతాలలో భద్రత, స్థిరత్వాన్ని సాధించే ప్రయత్నాలపై కూడా వారు సమీక్ష నిర్వహించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com