మెగా రేస్ నుంచి తప్పుకున్న ‘టిల్లు స్క్వేర్’.!
- July 06, 2023
యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన ‘డీజె టిల్లు’ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాని ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది చిత్ర యూనిట్. ఆ క్రమంలో ఆల్రెడీ అధికారికంగా ఆ డేట్‌ని అనౌన్స్ చేశారు కూడా. మెగాస్టార్ చిరంజీవితో టిల్లు గాడు సై అంటే సై అంటూ హెడ్డింగులు పెట్టి మీడియాలో కథనాలు కూడా వేడి వేడిగా వెలువడ్డాయ్.
అయితే, ఏమైందో ఏమో కానీ, ‘టిల్లు స్క్వేర్’ ఈ రేస్ నుంచి తప్పుకుంది. సెప్టెంబర్ వరకూ రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవితో నిలబడి గెలవలేం అనుకున్నాడో ఏమో, సిద్దు జొన్నలగడ్డ పక్కకి తప్పుకున్నాడు.
మంచిదే.! ‘టిల్లు స్క్వేర్’పై మంచి అంచనాలున్నాయ్. సో, ఆ అంచనాల్ని అందుకోవాలంటే, ఇలాంటి కొన్ని ముందు జాగ్రత్తలు తప్పవు మరి. టిల్లుగానితో అట్లుంటది.!
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







