ఖతార్ ప్రవాసీయుల వృత్తి/ఉద్యొగ మార్పుకు మార్గదర్శకాలు

- June 23, 2015 , by Maagulf
ఖతార్ ప్రవాసీయుల వృత్తి/ఉద్యొగ మార్పుకు మార్గదర్శకాలు

 

ఖతార్లో నివసిస్తున్న ప్రవాసీయులు, తమ కాంట్రాక్టు ముగిసిన అనంతరం లేదా ఓపెన్ కాంటాక్టు ఐనప్పుడు, ప్రస్తుత యజమాని వద్ద 5 సం. ల సర్వీసు పూర్తైన అనంతరం తమ ఉద్యోగాన్ని మారవచ్చునని - ప్రవాసీయ ప్రవేశ, నిష్క్రమణ మరియు నివాస చట్టం యొక్క అడ్వేజరీ కౌన్సిల్ తెలియచేసింది. తమ ఉద్యోగాన్ని మారడానికి ముందు ప్రవాసీయులు కార్మిక మరియు సామాజిక వ్యవహారాల మంత్రిత్వశాఖ వారి అనుమతి తీసుకోవలసి ఉంటుంది.
  యజమాని-శ్రామికుని మధ్య వివాదం నడుస్తున్న సందర్భంలో, వారు మరియొక యజమాని వద్ద తాత్కాలికంగా పనిచేయడానికి ఈ శాఖ వారు  అనుమతిస్తారు. గృహపనివారు శ్రామిక చట్టం పరిధిలోకి రారని, శ్రామిక చట్టం లేదా ఏ ఇతర చట్టం యొక్క అతిక్రమణ వల్లనైనా తీసివేయబడి, వారి విజ్ఞప్తి తిరస్కరింపబడినట్లైతే, వారు దేశంనుండి నిష్క్రమించిన 4 సoవత్సరాల తరువాత మాత్రమే కతార్ కు రావడానికి అనుమతింపబడతారని అధికారులు తెలిపారు.


--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com