చిన్న ఎలుక విమానం మొత్తాన్ని ఆపేసింది
- June 23, 2015
ఒక చిన్న ఎలుక.. విమానం మొత్తాన్ని ఆపేసింది. బర్మింగ్ హామ్ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఈ విమానాన్ని ఒక రోజు మొత్తం రద్దుచేసి పారేశారు. విమానంలో ఎలుక దూరిన విషయం తెలిసినా, దాన్ని పట్టుకోడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దాంతో ప్రయాణికులందరినీ దింపేసి, వాళ్లకు రాత్రి అక్కడే ఓ హోటల్లో బస ఏర్పాటుచేసి విమానం రద్దుచేశారు. కేబిన్ సిబ్బంది ఎలుకను పట్టుకోడానికి చాలా ప్రయత్నించారు గానీ, వాళ్ల వల్ల కాలేదని ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ సంస్థ తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ప్రకటించింది. విమానంలో ఎలుక ఉన్న విషయం తెలిసి, అది తమ కాళ్ల వద్దకు ఎక్కడ వస్తుందోనని ప్రయాణికులంతా చాలాసేపు భయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కానీ ఇది అసలైన వీడియో కాదని ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ అంటోంది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!







