ఏపీ స్టేట్ హైకోర్టులో ఉద్యోగాలు...
- July 08, 2023
అమరావతి: అమరావతిలోని ఏపీ స్టేట్ హైకోర్టులో క్లర్క్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన మొత్తం 26 లా క్లర్క్ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్మీడియట్ తర్వాత ఐదేళ్ల లా కోర్సులో ఉత్తీర్ణత లేదా మూడేళ్ల లా డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు అర్హులు. అలాగే నోటిఫికేషన్ జారీ అయిన తేదీకి రెండేళ్ల ముందుగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇతర బార్ కౌన్సిల్లలో అడ్వకెట్‌గా నమోదు చేసుకుని ఉండరాదు. అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.35,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను సంబంధిత డాక్యుమెంట్లతో రిజిస్ట్రార్ (రిక్రూట్మెంట్), AP హైకోర్టు, అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 522238. దరఖాస్తులకు చివరి తేదీ జులై 22, 2023 గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం వెబ్ సైట్ ; https://hc.ap.nic.in/పరిశీలించగలరు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







