7.3 మిలియన్ల మంది ప్రయాణికులతో కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్ట్ రికార్డు
- July 10, 2023
రియాద్: రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2023 రెండవ త్రైమాసికంలో 7.3 మిలియన్ల మంది ప్రయాణికులు ప్రయాణించారు. 2019లో 7.1 మిలియన్ల మంది ప్రయాణికులు రికార్డును తాజాగా అధిగమించింది. ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో సగటు రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 80,000 కంటే ఎక్కువగా నమోదైంది. ఈమేరకు రియాద్ ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ కార్యాచరణ పనితీరు నివేదికలో పేర్కొన్నారు. నివేదిక ప్రకారం, విమానాల సంఖ్య ఆరు శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2019 రెండవ త్రైమాసికం(48 వేలు)తో పోలిస్తే విమానాల సంఖ్య 51 వేలకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో 24 దేశీయ గమ్యస్థానాలు, 66 అంతర్జాతీయ గమ్యస్థానాలతో సహా 90 గమ్యస్థానాలకు చేరుకుంది. ఇది 4.6 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. రవాణా, సరుకు రవాణా సేవలను అందించే వాణిజ్య విమానయాన సంస్థలు 2019లో 39 కంపెనీలు ఉండగా.. నేడు వాటి సంఖ్య 30 శాతం పెరిగి 51 కంపెనీలకు చేరింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







