తెలంగాణలో బుధవారం విద్యా సంస్థలు బంద్..
- July 10, 2023
హైదరాబాద్: తెలంగాణలో బుధవారం విద్యా సంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి అఖిల భారత విద్యార్థి సంఘం (ABVP). ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజుల వసూలుకు వ్యతిరేకంగా ఏబీవీపీ గత కొద్దీ రోజులుగా ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో జూలై 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ విద్యా సంస్థలను మూసివేయించాయి. ఇక ఇప్పుడు తెలంగాణలో విద్యా రంగంలో జరుగుతోన్న అక్రమ ఫీజు దోపిడీకి వ్యతిరేకంగా జులై 12వ తేదీన విద్యా సంస్థలు బంద్ చేయాలంటూ పిలుపునిచ్చింది.
తాజాగా ఏఐఎస్‌ఎఫ్ నాయకులు హైదరాబాద్‌లోని కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పలు రకాల అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదంటూ నాయకులు విమర్శించారు. విద్యా రంగానికి బడ్జెట్‌లో సరైన కేటాయింపులు చేయడం లేదంటూ, విద్యార్థుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందంటూ ఆరోపించారు. విద్యా రంగంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిలంచాలని, స్కూల్ ఫీజులను తగ్గించాలనే డిమాండ్‌తో జులై 12వ తేదీ (బుధవారం) రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ బంద్ చేయాలంటూ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్‌లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!









