‘బేబీ’ విషయంలో అదంతా ఉత్త ప్రచారమేనా.?
- July 11, 2023
రౌడీ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ. తాజాగా ‘బేబీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ శుక్రవారం అనగా జూలై 14న ‘బేబీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. పీఆర్ టీమ్స్ బాగా యాక్టివ్‌గా పని చేస్తున్నాయ్ ‘బేబీ’ విషయంలో. సాయి రాజేష్ అంటే ఇండస్ట్రీలో ప్రత్యేకమైన పాపులారిటీ వుంది. ఆయన డైరెక్టర్‌గా తెరకెక్కుతోన్న సినిమా ఇది.
ఫేమస్ యూ ట్యూబర్ అయిన వైష్ణవీ చైతన్య ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండతో జత కడుతోంది. విరాజ్ అశ్విన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు బాగున్నాయ్.
అయితే, ఈ సినిమా గురించి పలు విభిన్నరకాల ప్రచారాలు వినిపిస్తున్నాయ్. ప్రచార చిత్రాలను చాలా ప్లెజెంట్‌గా డిజైన్ చేశారు. కానీ, సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులూ, అభ్యంతరకరమైన హాట్ సన్నివేశాలూ వున్నట్లు మాట్లాడుకుంటున్నారు. వాటిని సెన్సార్ టీమ్ కూడా అబ్జక్ట్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్. సెన్సార్ నుంచి బాగా కత్తెరలు కూడా పడ్డట్లు తెలుస్తోంది. చూడాలి మరి, ఈ ప్రచారం సినిమా రిజల్ట్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో.!
తాజా వార్తలు
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..







