గుమ్మడికాయనా? తలకాయనా?

- June 23, 2015 , by Maagulf
గుమ్మడికాయనా? తలకాయనా?

ఒకరోజు ఒక అడవి గుండా రామన్న అనే వ్యక్తి వెళుతున్నాడు. అక్కడ ఒక దొంగల ముఠా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంది. వాళ్లు రామన్నను గమనించారు. అతని దగ్గర ఏమన్నా ఉంటే దొచుకుందామన్న ఉద్దేశంతో అతన్ని చుట్టు ముట్టారు. కానీ రామన్న చేతిలో పుస్తకాలు తప్ప మరేమీ లేవు. దాంతో దొంగల ముఠా నాయకుడు రామన్నతో పుస్తకాలు తీసుకెళుతున్నావంటే నువ్వు బాగా చదువుకున్నవాడివన్న మాట అన్నాడు. అవును అన్నాడు రామన్న. అతని దగ్గర సొమ్మేమీ లేదని కోపంగా చూసున్నారు దొంగలు. అయితే ఆ విధంగా రామన్నని వదలాలని వారు అనుకోవడం లేదు. ఏదో రకంగా అతన్ని బాధించాలని నిర్ణయించుకుని నువ్వు బాగా చదుకుకున్నావు కదా. నీకు లెక్కలు బాగా వచ్చుంటాయి కదా. మేం ఒక లెక్క అడుగుతాం. దానికి సరిగ్గా సమాధానం చెప్పాలి. చెప్పకపోతే నిన్ను చంపేస్తాం అని చెప్పి, అక్కడ ఒక గుమ్మడికాయ ఉంటే అది తెచ్చి రామన్న చేతిలో పెట్టి దీని బరువెంతో ఖచ్చితంగా చెప్పాలి. ‘ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా’ అని హెచ్చరించారు. దానికి రామన్న ఆ గుమ్మడి కాయను అటూ ఇటూ గాల్లోకి ఎగరేసి కొంచెం ఆలోచించి ‘మీ నాయకుడి తలకాయంత’ అని తెగేసి చెప్పేశాడు. అందుకు ఆ దొంగల ముఠా ఆ గుమ్మడి కాయను, తమ నాయకుడి తలకాయను ఏరి పార చూస్తూ అతని దగ్గరకు రాసాగారు. దాంతో దొంగల నాయకుడికి ఈ వెర్రి వెంగలప్పలు నిజంగానే నా తల నరికి తూకం వేసి చూసి దాని బరువు నిర్ణయిస్తారోనని భయపడి, రామన్నను సముదాయించి ఊరికే నిన్ను ఆట పట్టిద్దామని ఈ పందెం వేశాం. దీనిలో నువ్వే గెలిచావు. నువ్వే తెలివైనవాడివి.తెలివిగా నీ ప్రాణం దక్కించుకున్నావు. నీ దారిన నువ్వు నిర్భయంగా వెళ్లి పోవచ్చు అని ఆ దొంగల ముఠా నాయకుడు రామన్నను విడిచిపెట్టాడు. రామన్న సంతోషంగా ఆ దారి గుండా తన ఊరు చేరుకున్నాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com