మహిళలు, చిన్నారులు సహా 24 మందిని కాపాడిన వ్యక్తికి సన్మానం

- July 13, 2023 , by Maagulf
మహిళలు, చిన్నారులు సహా 24 మందిని కాపాడిన వ్యక్తికి సన్మానం

దుబాయ్: అగ్నిప్రమాదం నుండి మహిళలు, పిల్లలతో సహా 24 మంది వ్యక్తుల ప్రాణాలను రక్షించిన దుబాయ్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ డిఫెన్స్‌తో కలిసి పనిచేస్తున్న మొదటి కార్పోరల్ గదీర్ హమూద్ అల్ కాబీని ఘనంగా సన్మానించారు. అల్ కాబీ ఆ ప్రాంతం గుండా వెళుతుండగా అగ్నిప్రమాదం చోటుచేసుకోవడాన్ని గమనించి అలెర్ట్ అయ్యాడు. సమయాన్ని వృథా చేయకుండా.. ప్రధాన ద్వారాన్ని తెరిచి లోపలికి వెళ్లి  మహిళలు, పిల్లలతో సహా అందరినీ బయటకు తీసుకొచ్చాడు.  సివిల్ డిఫెన్స్ బృందాలు వచ్చే వరకు గాయపడిన వారిలో ఒకరికి ప్రథమ చికిత్స కూడా అందించాడు. అల్ కాబీని జెబెల్ అలీ పోలీస్ స్టేషన్ డైరెక్టర్,  పోలీస్ స్టేషన్ల డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ మేజర్ జనరల్ డాక్టర్ అదెల్ అల్ సువైదీ సమక్షంలో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అసిస్టెంట్ కమాండర్-ఇన్-చీఫ్, మేజర్ జనరల్ ఎక్స్‌పర్ట్ ఖలీల్ ఇబ్రహీం అల్ మన్సూరి సత్కరించారు. మంటలు, పొగతో చుట్టుముట్టబడిన ఇంట్లోకి ప్రవేశించి లోపల ఉన్నవారి ప్రాణాలను, ఆస్తులను రక్షించడంలో వేగంగా స్పందించినందుకు అల్ కాబీకి అల్ మన్సూరి ఫస్ట్ కార్పోరల్ కృతజ్ఞతలు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com