స్వామినారాయణ అక్షరధామ్ ని సందర్శించిన ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్

- July 14, 2023 , by Maagulf
స్వామినారాయణ అక్షరధామ్ ని సందర్శించిన ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్

న్యూఢిల్లీ: భారత పర్యటనలో ఉన్న ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్, ఇంటర్నేషనల్ ఇస్లామిక్ హలాల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ షేక్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ కరీమ్ అల్-ఇస్సా న్యూఢిల్లీలోని ప్రసిద్ధ భారతీయ కళ, వాస్తుశిల్పం, సంస్కృతి మరియు విలువల వైభవాన్ని చాటిచెప్పే స్వామినారాయణ్ అక్షరధామ్‌ను సందర్శించారు. అక్కడ ఆయన 3 గంటలపాటు పర్యటించి అక్కడి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. పరమ పూజ్య మహంత్ స్వామి మహారాజ్ తరఫున మయూర్ ద్వార్ వద్ద స్వామి బ్రహ్మవిహారిదాస్, స్వామి ధర్మవత్సల్దాస్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. సౌది అరేబియాలోని రియాద్‌లో 2022లో జరిగిన మొదటి గ్లోబల్ సర్వమత సదస్సులో స్వామి బ్రహ్మవిహారిదాస్‌ని అతను చివరిసారిగా కలుసుకున్నట్లు, ఇప్పుడు మళ్లీ కలవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తన పర్యటనలో భాగంగా  గజేంద్ర పీఠం చుట్టూ తిరుగుతూ.. మత సామరస్యం, కుటుంబ ఐక్యత విలువలపై ప్రసంశలు కురిపించారు. అనంతరం మానవ సామరస్యం, శాంతియుత ప్రపంచం కోసం ఉమ్మడి లక్ష్యాలు, భాగస్వామ్య విలువలపై స్వామి బ్రహ్మవిహారిదాస్‌తో కలిసి చర్చించారు. BAPS సంస్థ కొనసాగిస్తున్న ప్రపంచవ్యాప్త సామాజిక, ఆధ్యాత్మిక సేవలను కొనియాడారు. అబుధాబిలో చారిత్రాత్మక BAPS హిందూ మందిర్ గురించి ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. అది ప్రపంచ సామరస్యానికి ఆధ్యాత్మిక ఒయాసిస్‌గా మారుతుందని అకాంక్షించారు. అల్-ఇస్సాకు అక్షరధామ్ నమూనాను బహుమతిగా అందించిన స్వామీజీలు, ఆయనను ఘనంగా సత్కరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com