అబుధాబి చేరుకున్న ప్రధాని మోడీ...
- July 15, 2023
అబుధాబి: భారత ప్రధాని నరేంద్ర మోదీ అబుధాబి చేరుకున్నారు. అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. మోదీ అధికారిక పర్యటన నిమిత్తం యూఏఈలో పర్యటిస్తున్నారు. ఈరోజు విమానాశ్రయంలో తనను రిసీవ్ చేసుకున్నందుకు షేక్ ఖలీద్‌కు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా తనను స్వాగతించినందుకు క్రౌన్ ప్రిన్స్ హెచ్‌హెచ్ షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు కూడా కృతజ్ఞతలు అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
యూఏఈలో అధికారిక పర్యటనలో భాగంగా దేశాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో మోదీ సమావేశమై చర్చలు జరుపుతారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. "భారత్-యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం క్రమంగా బలపడుతోంది.ఇంధనం, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత, ఫిన్‌టెక్, రక్షణ మరియు సంస్కృతి వంటి వివిధ డొమైన్‌లలో దీనిని ముందుకు తీసుకెళ్లే మార్గాలను గుర్తించడానికి ప్రధానమంత్రి పర్యటన ఒక అవకాశంగా ఉంటుంది" మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇదిలా ఉండగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా నిన్న రాత్రి భారత త్రివర్ణ జెండాను ప్రదర్శించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







