తిరుమల, షిర్డీకి ఏసీ స్లీపర్ ప్రత్యేక బస్సులు
- July 15, 2023
హైదరాబాద్: తిరుమల, షిర్డీ వెళ్లే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. తిరుమల, షిర్డీకి ప్రభుత్వం ఏసీ స్లీపర్ బస్సులు నడపనుంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తిరుమల, షిర్డీకి ప్రత్యేక సర్వీసులను తీసుకొచ్చినట్లు ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
తిరుపతి, షిర్డీకి రెండు ఏసీ స్లీపర్ బస్సులు, హైదరాబాద్ సిటీ సైట్ సీన్ కోసం ఏసీ మినీ బసు సర్వీసును టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి శుక్రవారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్-తిరుమలకు రెండు రోజుల ప్యాకేజీలో భాగంగా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. పెద్దలకు రూ.4,200, పిల్లలకు రూ.3,360 టికెట్లు ఉంటాయని పేర్కొన్నారు. ప్యాకేజీలో భక్తులకు శ్రీఘ్రదర్శన టికెట్లను అందించనున్నట్లు వెల్లడించారు.
కొత్తగా రూ.3.5 కోట్లతో 2 అత్యాధునిక ఓల్వో మల్టీ ఎక్సెల్ ఏసీ స్లీపర్ కోచ్ బసు సర్వీసులను,
32.61 లక్షలతో మినీ ఏసీ బస్సు సర్వీసులను పర్యాటక శాఖ కొనుగోలు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీత పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, పర్యటక శాఖ ఎండీ మనోహర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







