‘Bro’ లో ఆ డోస్ కూడా ఎక్కువే బాస్.!

- July 15, 2023 , by Maagulf
‘Bro’ లో ఆ డోస్ కూడా ఎక్కువే బాస్.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం స్టార్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో ‘బ్రో’ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. ఈ నెల 28న ‘బ్రో’ రిలీజ్‌కి సిద్ధంగా వుంది. ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు.
టీజర్ నుంచీ రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘జానవులే.. ’ సాంగ్ వరకూ టాప్ లెవల్లో ప్రమోషన్లు చేస్తున్నారు. మొన్న టీజర్‌కే పవర్ ఫ్యాన్స్ ఫుల్ పటాస్.. అంటే, ఆ తర్వాత ‘మై డియర్ మార్కండేయ..’ అంటూ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు.
ఇదే అనుకుంటే, ఈ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసి, అంచనాల్ని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లారు. తాజాగా ‘జానవులే..’ అంటూ కేతిక శర్మ, సాయి ధరమ్ తేజ్ జంటగా ఓ డ్యూయెట్ రిలీజ్ చేశారు. 
ఈ పాటలో కేతిక శర్మ హాట్ అప్పీల్ కుర్రకారుకు హీటెక్కిస్తోంది. అలాగే, తేజు, కేతికల మధ్య కెమిస్ర్టీ వేరే లెవల్. ఇంతవరకూ ఈ సినిమాని చూసిన యాంగిల్ వేరు. ఈ సాంగ్ వచ్చాకా వేరు.. అన్నట్లుగా మారింది.
పక్కాగా కమర్షియల్ అంశాల్నీ కూడా ఈ సినిమాలో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. ఇక, ముందు ముందు రాబోయే ‘బ్రో’ అప్‌డేట్స్ ఎలా వుండబోతున్నాయో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఏ రేంజ్‌లో కిక్ ఇవ్వనున్నాయో చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com