సితార ఎంట్రీని షురూ చేసిన నమ్రత.!
- July 15, 2023
గత కొన్ని రోజులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితార ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తోంది. ఆ మాటకొస్తే, సితారకు సంబంధించి ఏ చిన్న న్యూస్ అయినా అది వైరల్ న్యూసే అవుతుంది.
ఇటీవల ఓ జ్యూయలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా సితార వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ యాడ్ షూట్‌కి సంబంధించిన సితార ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయ్. ఆ జ్యూయలరీ సంస్థ ఎక్స్‌పెక్ట్ చేసిన హైప్ రావడంతో, తాజాగా ఓ కార్యక్రమం నిర్వహించారు.
ఈ ఈవెంట్‌కి సితారతో సహా ఆమె తల్లి, మహేష్ బాబు సతీమణి, మాజీ హీరోయిన్ నమ్రత శిరోడ్కర్ కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా నమ్రత కొన్ని ఆసక్తికరమైన అంశాల్లో క్లారిటీ ఇచ్చింది.
మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఎంట్రీ గురించి అడగ్గా, ఓ ఐదారేళ్ల తర్వాత గౌతమ్ ఎంట్రీ వుంటుందని నమ్రత క్లారిటీ ఇచ్చింది. పిల్లలు ఏం కోరుకుంటే అది తల్లితండ్రులుగా ఎప్పుడూ మేం సపోర్ట్ చేస్తామని నమ్రత చెప్పింది.
అలాగే, సితారకు నటన పట్ల ఎంతో ఆసక్తి వున్నట్లుగా కూడా నమ్రత వివరించింది. త్వరలోనే సితార హీరోయిన్‌గా తెరంగేట్రం చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సితార ఓ షార్ట్ ఫిలింకి సైన్ చేసినట్లు సమాచారం. అతి త్వరలోనే బిగ్ స్ర్కీన్‌పై ఎంట్రీ ఇచ్చేందుకు సితార సిద్ధంగా వుందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







