ఈ సారీ బోనాలకు పిలుపు రాలేదు: టి.గవర్నర్ తమిళి సై
- July 16, 2023
హైదరాబాద్: ఎప్పటి లాగే తెలంగాణ ప్రభుత్వం తరుఫున బోనాలకు పిలుపు రాలేదని గవర్నర్ తమిళిసై అన్నారు. అందుకే రాజ్‌భవన్‌లో బోనాల వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా రాజ్‌భవన్‌లోని నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో గవర్నర్ బోనం సమర్పించి వడి బియ్యం పోశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కఅతీ సంప్రదాయాలకు ప్రతీకగా బోనాలు జరుపుకొంటున్నారని.. ప్రజలకు అన్ని సౌకర్యాలూ అందాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. మరోవైపు చంద్రయాన్-3ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు గవర్నర్ అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







