‘జైలర్’ సినిమాపై కోర్టులో పిటిషన్..
- July 16, 2023
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న చిత్రం ‘జైలర్’. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ జాకీ ష్రాఫ్, రమ్య కృష్ణ, సునీల్.. లాంటి స్టార్ యాక్టర్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రస్తుతం జైలర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి ఇప్పటికే ఓ సాంగ్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అయితే తాజాగా జైలర్ సినిమా ఓ వివాదంలో ఇరుక్కుంది. మలయాళం డైరెక్టర్ సక్కిర్ మడతిల్ జైలర్ సినిమాపై కేసు వేశాడు. అదే జైలర్ టైటిల్ ని తాను 2021 లోనే కేరళ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించానని, ఆ సినిమా షూటింగ్ కూడా అయిపోయిందని, సినిమా టైటిల్ ని కమల్ హాసన్ వచ్చి లాంచ్ చేశారని తెలిపాడు.
రజినీకాంత్ జైలర్ టైటిల్ ని మార్చాలంటూ చిత్రయూనిట్ ని కోరగా వాళ్ళు స్పందించకపోవడంతో మద్రాస్ హై కోర్టులో పిటిషన్ వేశాడు మలయాళం డైరెక్టర్. ఆగస్టు 2న ఈ పిటిషన్ హియరింగ్ కి రానుంది. దీంతో ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే రెండు వేరు వేరు భాషల్లో సినిమాలు కాబట్టి కోర్టు ఈ పిటిషన్ కొట్టేస్తుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి కోర్టు ఏం తీర్పు ఇస్తుందో చూడాలి. లేదా రజినీకాంత్ స్టార్ హీరో కాబట్టి కూర్చొని మాట్లాడుకుంటే లేదా డబ్బులతో ఈ వివాదం సెటిల్ అయిపోతుందని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







