యాక్షన్ మోడ్‌లో నయన్.!
- July 18, 2023
సౌత్ క్వీన్‌గా చెలామణీ అవుతున్న ముద్దుగుమ్మ నయన తార, బాలీవుడ్‌లో నటిస్తున్న సినిమా ‘జవాన్’. షారూఖ్ ఖాన్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాలో నయన తారకు చాలా చాలా పవర్ ఫుల్ రోల్ దక్కినట్లు తెలుస్తోంది.
రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్‌లో నయనతారకూ ఇంపార్టెన్స్ దక్కింది. బీభత్సమైన యాక్షన్ కట్స్ నయన తారపై కట్ చేశారు. ఈ యాక్షన్ సీన్లకు నయన తార ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
బాలీవుడ్‌లో డెబ్యూ ఇంత ఘనంగా దక్కడంతో, నయన్ తదుపరి బాలీవుడ్ ప్రాజెక్టుల పైనా అంచనాలు పెరుగుతున్నాయ్. కాగా, ఈ సినిమాలో దీపికా పదుకొనె ఓ స్పెషల్ రోల్‌లో కనిపించబోతోంది.
‘పటాన్’ సినిమాతో ఫుల్ ఫామ్‌లో వున్న షారూఖ్ ఖాన్‌కి ‘జవాన్’ కూడా ఓ సూపర్ హిట్ మూవీ అవుతుందని అంటున్నారు. ఇక, నయన్ విషయానికి వస్తే, ప్రస్తుతం తెలుగులో నయన్ చేస్తున్న సినిమాలేమీ లేవు. కానీ, ‘జవాన్’ హిట్టయితే మాత్రం నయన తార రేంజ్ ఇంకెక్కడికో వెళ్లిపోవడం ఖాయమనే అభిప్రాయాలొస్తున్నాయ్.
తాజా వార్తలు
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!