వివా - చైల్డ్ ట్రాకింగ్ టెక్నాలజీ మొబైల్ వాచ్
- May 15, 2016
బహ్రెయిన్‌లో ప్రముఖ టెలికామ్ ఆపరేటర్ అయిన వివా బహ్రెయిన్, వివా చైల్డ్ మలక్ ఇ ట్రాకర్ వాచ్‌ని ప్రవేశపెట్టింది. ఈ మొబైల్ వాచ్ ద్వారా, తమ పిల్లలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు వంటి అంశాల గురించి ఎప్పటికప్పుడు 'ట్రాక్' చేసుకునే వీలుంటుందని వివా బహ్రెయిన్ ప్రతినిథులు తెలిపారు. ఐఓఎస్, యాండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే మొబైల్ అప్లికేషన్‌తో ఈ వాచ్ పనిచేస్తుంది. వాయిస్ మెసేజ్‌లను పంపడం, వాయిస్ కాల్స్ చేసుకోవడం, సేఫ్ ఏరియా లిమిట్స్‌ని డిఫైన్ చేసుకోవడం వంటివి ఈ అప్లికేషన్‌తో వీలవుతాయి. 8 నంబర్స్ నుంచి కాల్స్‌ని రిసీవ్ చేసుకునేలా, ముగ్గురు స్టోర్ చేసుకున్న నెంబర్లకు కాల్ చేసుకునేలా ఈ మొబైల్ వాచ్‌ని రూపొందించారు. అవాంఛనీయ కాల్స్‌ని బ్లాక్ చేసే వీలు కూడా ఇందులో ఉంది. వివా మలక్ ఇ వాచ్, వివా రిటైల్ ఔట్‌లెట్స్ వద్ద 5 బహ్రెయినీ దినార్స్ నెలసరి ఖర్చుతో లభ్యమవుతాయి. వివా వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు పొందవచ్చు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్స్ ద్వారా మొబైల్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







