కెరీర్ ఫెయిర్‌లో టాలెంట్ హంట్
- May 15, 2016
16వ యూఏఈ కెరీర్ ఫెయిర్ సోమవారం ప్రారంభమవుతుంది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లఓ ప్రారంభమయ్యే ఈ ఫెయిర్‌లో 31 దుబాయ్ ప్రభుత్వ సంస్థలు, 800 ఉద్యోగాలతో ఔత్సాహికుల్ని ఆకర్షించనున్నాయి. దుబాయ్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కెరీర్ ఎగ్జిబిషన్ మే 16 నుంచి 18 వరకు జరుగుతుంది. 'షేపింగ్ ఫ్యూచర్' అనే కాన్సెప్ట్‌తో ఈ ఫెయిర్‌ని నిర్వహిస్తున్నారు. వివిధ రంగాల్లో టాలెంటెడ్ యువతకు ఈ ఫెయిర్ ద్వారా ఉద్యోగావకాశాల్ని కల్పించనున్నారు. కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యూఏఈ పౌరులకు ఇక్కడ అవకాశాలు దక్కనున్నాయి. ఈ ఎగ్జిబిషన్లో మాస్టర్ క్లాసెస్, వర్క్‌షాప్స్, ఇంటరాక్టివ్ ఈవెంట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక అవసరాలు కలిగినవారికి కూడా వీలుగా ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాట్లున్నాయి. రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కూడా ఈ ఎగ్జిబిషన్లో భాగస్వామ్యం పంచుకుంటోంది. రెండేళ్ళపాటు ట్రెయినింగ్ ప్రోగ్రామ్ నిర్వహించి, ప్రాక్టికల్ ట్రెయినింగ్ అందిస్తామనీ, ప్రతిభ చూపిన వారికి ప్రత్యేక రివార్డులు అందిస్తామని ఆర్టిఏ ప్రతినిథులు చెప్పారు. దుబాయ్ కస్టమ్స్ 128 వేకెన్సీలను ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఔత్సాహికులతో భర్తీ చేయాలనుకుంటోంది.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







