Go First ఆపరేషన్స్ పునఃప్రారంభానికి అనుమతి
- July 22, 2023
న్యూఢిల్లీ: పౌర విమానయాన నియంత్రణ సంస్థ DGCA షరతులతో గ్రౌండెడ్ ఎయిర్‌లైన్ గో ఫస్ట్‌ను తన కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి అనుమతించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ మేరకు తెలిపింది. విమాన షెడ్యూల్‌ను రెగ్యులేటర్ ఆమోదించిన తర్వాతే టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభించవచ్చని డీజీసీఏ స్పష్టం చేసింది.
మే 2న, గో ఫస్ట్ తన విమానాలను రద్దు చేసింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ముందు స్వచ్ఛంద దివాలా కోసం దాఖలు చేసింది. మే 10న, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) మారటోరియం విధించింది. మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్ (IRP)ని నియమించింది. ఆ తర్వాత జూన్ 9న, కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ (CoC) గో ఫస్ట్ కోసం రిజల్యూషన్ ప్రొఫెషనల్ (RP)గా శైలేంద్ర అజ్మీరాను నియమించింది. దీనిని NCLT తరువాత ఆమోదించింది. RP పునరుద్ధరణ ప్రణాళికను 28.06.2023న DGCAకి సమర్పించారు.
2023 జూలై 4 నుండి 6వ తేదీ వరకు ముంబై, ఢిల్లీలో గో ఫస్ట్ సౌకర్యాల ప్రత్యేక ఆడిట్ జరిగింది. దీంతో రెగ్యులేటర్ 15 విమానాలు/ 114 రోజువారీ విమానాలను నడపడానికి అనుమతించింది. ఎయిర్‌లైన్‌లో దాదాపు 4,200 మంది ఉద్యోగులు ఉన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల ద్వారా మొత్తం ఆదాయాన్ని రూ. 4,183 కోట్లుగా నివేదించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







