‘గుంటూరు కారం: ఎంత కష్టమొచ్చిందో పాపం.!
- July 22, 2023
‘గుంటూరు కారం’ సినిమాకి వున్న కష్టాలు చాలవన్నట్లుగా ఒకదానికి ఒకటి తోడవుతూనే వున్నాయ్. మొన్నేమో హీరోయిన్ పూజా హెగ్ధే హ్యాండిచ్చింది. తాజాగా సినిమాటోగ్రాఫర్ హ్యాండిచ్చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు సినిమా షూటింగ్ విషయంలోనూ పలు రకాల గాసిప్స్ మహేష్ అభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయ్. ఇదిగో షూటింగ్ ఆగిపోయిందట.. అదిగో షూటింగ్ వాయిదా పడిందట.. అనే వార్తలు మహేష్ ఫ్యాన్స్‌లో ఎప్పటికప్పుడు టెన్షన్ వాతావరణం క్రియేట్ చేస్తున్నాయ్.
ఇప్పటికే సినిమా స్టార్టింగ్ నుంచీ, షూటింగ్‌కి ఏదో రకంగా అవాంతరాలు ఎదురవుతూనే వస్తున్నాయ్. తాజాగా కూడా ఇదే గాసిప్ చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబు వెకేషన్లో భాగంగా లండన్ వెళుతున్నారట. దాంతో, మళ్లీ షూటింగ్‌కి బ్రేక్ పడుతోందని అంటున్నారు.
అయితే, మహేష్ బాబు లేకుండా చిత్రీకరించాల్సిన సీన్ల చిత్రీకరణ జరుగుతోందంటూ మాట్లాడుకుంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరికీ మంచి కో ఆపరేషన్ వుంది. అలాంటిది ఎందుకో ఈ సినిమా విషయంలో ఇవన్నీ పెద్దగా వర్కవుట్ అవుతున్నట్లు కనిపించడం లేదు. ఇలా ‘గుంటూరు కారం’ సినిమా రిలీజ్ అయ్యేదెప్పుడో.! అనే అనుమానాలు తలెత్తుతున్నాయ్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







