భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ కొత్త రూల్స్
- July 22, 2023
న్యూ ఢిల్లీ: ప్రముఖ ఓటీటీ స్ర్టీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారతీయ వినియోగదారుల కోసం సరికొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఇప్పటివరకూ సింగిల్ అకౌంట్ యూజర్ తమ అకౌంట్‌ను అందరితో షేరింగ్ చేసుకునే వీలుండేది. కానీ, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఇతర దేశాలతో పాటు భారత్‌లోనూ పాస్‌వర్డ్ షేరింగ్ విధానాన్ని నిలిపివేసింది.
ఇకపై నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ పాస్‌వర్డ్‌లను ఒకే ఇంటిలో నివసించని స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేస్తే.. నెట్‌ఫ్లిక్స్ ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి. స్ట్రీమింగ్ దిగ్గజం ఇటీవల భారత ఓటీటీ మార్కెట్లోనూ అకౌంట్, పాస్‌వర్డ్ షేరింగ్‌పై కఠినమైన పరిమితులను ప్రకటించింది. ఈ చర్యతో పాస్‌వర్డ్ షేరింగ్ అనేది ఒక ఇంటికి మాత్రమే పరిమితం అయింది. స్నేహితులతో అకౌంట్లను షేర్ చేసుకునే అలవాటు ఉన్న కొంతమంది వినియోగదారులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు
నెట్‌ఫ్లిక్స్ కొత్త పాలసీ ఒకే అకౌంట్‌ను ఒక కుటుంబంలో మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేస్తుంది. కుటుంబ సభ్యులు కలిసి జీవిస్తున్నప్పటికీ.. వారు ఇంట్లో ఉన్నా, సెలవులో ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా వివిధ డివైజ్‌లలో Netflix అకౌంట్ ఆస్వాదించవచ్చు. నెట్‌ఫ్లిక్స్ కుటుంబ సభ్యులు ఒకే కుటుంబంలో అకౌంట్ షేరింగ్ చేయడాన్ని సులభతరం చేయడానికి ‘Transfer Profile’, ’Manage Access and Devices’ వంటి ఫీచర్లను అందిస్తుంది.
గతంలో, భారత్‌లో చాలా మంది యూజర్లు తమ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్లను ఖర్చును తగ్గించుకోవడానికి స్నేహితులతో షేర్ చేసుకున్నారు. దురదృష్టవశాత్తూ.. ఈ కొత్త చర్యలతో ప్రైమరీ కుటుంబానికి చెందని వ్యక్తులతో ఇలాంటి అకౌంట్ షేరింగ్ చేయడం కుదరదు. కానీ, ఇంటి వెలుపల ఉన్న సభ్యులు ఎవరైనా వారి ప్రొఫైల్‌లను కొత్త అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి, ప్రత్యేక సభ్యత్వాన్ని పొందడం ద్వారా వినియోగించుకోవచ్చు. అంటే.. ప్రొఫైల్ ట్రాన్స్ ఫర్ చేయడానికి తప్పకుండా పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది.
నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ను గుర్తించడానికి అడ్వాన్సడ్ మెథడ్స్ ఉపయోగిస్తుంది. అకౌంట్లో లాగిన్ చేసిన డివైజ్‌ల నుంచి యూజర్ నేమ్, IP అడ్రస్, డివైజ్ ID, అకౌంట్ యాక్టివిటీ ట్రాక్ చేస్తుంది. అలా చేయడం ద్వారా ప్రైమరీ హౌస్ వెలుపల ఉన్న వినియోగదారులకు యాక్సెస్‌ని పొందడం సవాలుగా మారుతుంది. నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులు ప్రాథమిక కుటుంబానికి వెలుపల నుంచి అకౌంట్ యాక్సెస్ చేసేందుకు కోడ్‌లను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ కోడ్‌లు 7 రోజుల వరకు చెల్లుబాటులో ఉంటాయి. అదనంగా, వినియోగదారులు కనీసం ప్రతి 31 రోజులకు ఒకసారి ప్రైమరీ ఫ్యామిలీ Wi-Fiకి కనెక్ట్ చేయాలి.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







