ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు
- May 16, 2016
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చి ఓటు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి, ఆయన కుమారుడు స్టాలిన్, డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్ తదితరులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. సినీనటులు కమల్‌హాసన్, రజినీకాంత్, కుష్బూ దంపతులు, మీనా, రాధిక, జీవా ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. ఓటుహక్కు వినియోగించుకోవడం వల్ల ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఓటు వేయడం అందరి బాధ్యత అని స్టాలిన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రజలు ముందుకు వచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చార కేరళలో.. కేరళ సీఎం ఉమెన్‌ఛాందీ కొట్టాయంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. మాజీ క్రికెటర్ శ్రీశాంత్, సినీనటులు మమ్ముట్టీ, సురేశ్‌గోపి, మాజీ కేంద్ర మంత్రులు ఏకే ఆంటోని, శశిథరూర్‌లు ఓటు వేశారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







