బంగ్లాదేశ్: చెరువులోకి దూసుకెళ్లిన బస్సు ..17 మంది మృతి
- July 23, 2023
బంగ్లాదేశ్‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. భండారియా ఉప జిల్లా నుంచి ఫిరోజ్‌పూర్‌కు 70 మందితో వెళ్తున్న బస్సు ఝలకతి సదర్ ఉపజిల్లా పరిధిలోని ఛత్రకాండ ప్రాంతంలో అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, 8 మంది మహిళలు ఉన్నట్లు పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ గౌతమ్ కుమార్ ఘోష్ తెలిపారు.
35 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారన్నారు. భండారియా ఉపజిల్లా నుంచి ఫిరోజ్‌పూర్‌కు వెళ్తున్న ఈ బస్సు స్థానిక యూనియన్ పరిషత్ కార్యాలయం సమీపంలో ఆటో రిక్షాకు సైడ్ ఇస్తుండగా అదుపుతప్పి చెరువులో పడిపోయింది. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







