'నీరు-ప్రగతి'లో దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని రూపొందిదాం
- May 16, 2016
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో ఈరోజు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 'నీరు-ప్రగతి'లో దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని రూపొందిద్దామని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు.ఉపాధి హామీ కింద ఇప్పటి వరకు రూ.వెయ్యి కోట్లు ఖర్చుచేశామని, రాబోయే 45రోజుల్లో మరో రూ.వెయ్యి కోట్లు వ్యయం చేసేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
కృష్ణా, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉపాధి హామీ పనుల్లో పురోగతి బాగుందని, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇంకా ముందంజ వేయాల్సి ఉందన్నారు. పంట సంజీవనిలో అనంతపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాలు ముందంజలో ఉంన్నాయని... శ్రీకాకుళం, కృష్ణా, విశాఖ, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాలు మెరుగుపడాల్సి ఉందని సూచించారు.. ఈ ఏడాది ఎన్టీఆర్ జలసిరి కింద 6,21,745 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. రాబోయే 45 రోజుల్లో 'నీరు-ప్రగతి' కార్యక్రమం ముమ్మరం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







