ఇండోనేషియాలో నౌక మునిగి 15 మంది మృతి
- July 24, 2023
జకార్తా: ఇండోనేషియాలో సోమవారం సులవేసి ద్వీపంలోని సముద్రంలో నౌక మునిగింది. ఈ ప్రమాద ఘటనలో 15 మంది ప్రయాణికులు మరణించగా, మరో 19 మంది గల్లంతు అయ్యారు. ఆగ్నేయ సులవేసి ప్రావిన్స్ రాజధాని కేందారీకి దక్షిణంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మునా ద్వీపంలోని ఒక బే గుండా ఈ నౌక ప్రయాణికులను తీసుకువెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగినపుడు నౌకలో 40మంది ప్రయాణికులున్నారని వారిలో ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారని ఇండోనేషియా అధికారులు చెప్పారు. రాత్రి సమయంలో నౌక మునిగిపోవడానికి కారణాలు ఇంకా తెలియలేదు. ప్రాణాలతో బయటపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ ప్రతినిధి ముహమ్మద్ అరాఫా చెప్పారు.
మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించారు. 17,000 కంటే ఎక్కువ ద్వీపాలతో కూడిన ఇండోనేషియాలో నౌకలపై ప్రయాణిస్తుంటారు. దీంతో ప్రమాదాలు అధికంగా జరుగుతుంటాయి. నౌకల ప్రయాణాల్లో భద్రతా ప్రమాణాలకు తిలోదకాలు ఇవ్వడంతో ప్రయాణికుల ప్రాణాలను రక్షించే పరికరాలు లేకుండా ఓడలను ఓవర్లోడ్ చేస్తుంటారు. దీంతో తరచూ ఇండోనేషియాలో ప్రమాదాలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









