చంద్రబాబు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
- July 24, 2023
చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు నాయుడు సొంత ఇంటి నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. చంద్రబాబు ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. దీంతో ఇంటి నిర్మాణానికి శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఇంటి నిర్మాణం కోసం కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురం వద్ద జాతీయ రహదారి పక్కన రెండు ఎకరాల స్థలాన్ని చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు. గత ఏడాది జూలైలోనే రిజిస్ట్రేషన్ పూర్తి అయింది. అయితే, వివిధ కారణాల వలన ఇంటి నిర్మాణానికి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులు మంజూరు చేయకపోవడంతో వివాదం చెలరేగింది.
అన్ని పత్రాలు సమర్పించినా ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వకపోవడం పట్ల ఇటీవల కుప్పం పర్యటనలోనూ చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కాగా, తాజాగా చంద్రబాబు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







