ప్రవీణ్ సత్తారు మళ్లీ అదే ట్రాక్.! సక్సెస్ అవుతాడా.?
- July 24, 2023
జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్ సత్తారు. డిఫరెంట్ జోనర్స్‌ని తన సినిమాల కోసం ఎంచుకుంటూ వుంటాడు. కానీ, చెప్పుకోదగ్గ సక్సెస్‌లు మాత్రం అందుకోలేకపోయాడు. ‘గరుడవేగ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘ది ఘోస్ట్’ మాత్రం ఫెయిల్ అయ్యింది.
ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో ‘గాంఢీవధారి అర్జున’ సినిమాతో రాబోతున్నాడు. ఆగస్ట్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘గాంఢీవ ధారి అర్జున’ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్లో యాక్షన్ సీన్లు గట్టిగా చూపించారు.
మెగా ప్రిన్స్ హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు. లక్షల కోట్ల స్కామ్ నేపథ్యం చుట్టూ సాగే ఓ వ్యాపారానికి సంబంధించిన కథగా టీజర్లో హింట్ ఇచ్చారు. ఈ కథనానికి హై ఓల్టేజ్ యాక్షన్ జోడించి ప్రవీణ్ సత్తారు తెరకెక్కించినట్లు అర్ధమవుతోంది.
గన్నులు బీభత్సంగా వాడేశారు. అప్కోర్స్.! ఈ ట్రెండ్ ఇప్పుడు హిట్ ఫార్ములా అనుకోండి. సాక్షి వైధ్య ఈ సినిమాలో హీరోకి ధీటైన పాత్రలో నటిస్తున్నట్లు టీజర్లో చూపించారు. చూడాలి మరి, ప్రవీణ్ సత్తారు ‘గాంఢీవధారి అర్జున’తో అయినా హిట్ కొడతాడేమో.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







