‘బ్రో’లో ఆ లాజిక్స్ చూడొద్దు.! ఎంజాయ్ చేస్తేనే ముద్దు.!
- July 24, 2023
‘బ్రో’ మేనియా మొదలైంది. మరి కొద్ది రోజుల్లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 28న ‘బ్రో’ గ్రాండ్‌గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్లలో భాగంగా, వదులుతున్న ప్రచార చిత్రాలు ఫ్యాన్స్‌ని హుషారెత్తిస్తున్నాయ్.
రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్ అయితే, పవర్ ఫ్యాన్స్‌కి ఎక్కడ లేని కిక్కిచ్చిందనే చెప్పొచ్చు. మరోవైపు ప్రమోషన్లలో భాగంగా సాయి ధరమ్ తేజ్ పలు ఇంటర్వ్యూల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘బ్రో’కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటున్నాడు.
‘బ్రో’లో చాలా వరకూ క్యాజువల్‌గా మామా అల్లుళ్ల మధ్య జరిగిన సీన్స్‌ని షూట్ చేసేశారనీ, అవి చాలా నేచురల్‌గా వచ్చాయని తేజు చెప్పాడు.
అలాగే, దేవుడిగా నటించిన పవన్ కళ్యాణ్ బీడీలు పట్టుకోవడం, లుంగీలు కట్టుకోవడం.. లాంటివి చేస్తాడనీ, వాటిని నెగిటివ్ కోణంలో చూడొద్దనీ.. కేవలం ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడం కోసమే అలా చేశారనీ, లాజిక్కులు అడక్కుండా, ఎంజాయ్ చేయాలని ఫ్యాన్స్‌కి సూచించాడు.
అయితే, ఫ్యాన్స్‌తో ఎప్పుడూ ప్రాబ్లెమ్ కాదు.. మరి, వంక దొరికితే చాలు డొంక పట్టుకుని లాగాలని చూసే వాళ్ల నోళ్లు ఎలా మూయిస్తారు ‘బ్రో’.!
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







