దటీజ్ తమన్.! థీమ్ సాంగ్ అదరగొట్టేశావ్ ‘బ్రో’.!
- July 25, 2023
కాపీ ట్యూన్లు ఇస్తున్నాడంటూ ఈ మధ్య మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌పై అనేక విమర్శలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. ఎన్ని విమర్శలొచ్చినా తమన్ మ్యూజిక్‌కి వుండే కిక్కే వేరప్పా.!
అది ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నాడు తమన్ ‘బ్రో’ థీమ్ సాంగ్‌తో. తాజాగా రిలీజ్ చేసిన ‘బ్రో’ థీమ్ సాంగ్ మ్యూజిక్ దద్దరిల్లిపోతోందంతే. పవర్ స్టార్ ఫ్యాన్స్‌ని వేరే లోకంలోకి తీసుకెళ్లిపోతోంది.
డాల్బీ అట్మాస్ మ్యూజిక్ సిస్టమ్‌లో ఈ థీమ్ సాంగ్ ఇచ్చే కిక్కు వేరే లెవల్లో వుంటోందని ఇప్పటికే తమన్‌ని తెగ పొగిడేస్తున్నారంతా. విమర్శలెన్ని వచ్చినా తమన్‌కి వుండే క్రేజ్ ఎందుకిలా.? అన్న ప్రశ్నకి సమాధానంగా ‘బ్రో’ థీమ్ సాంగ్‌ని కసిగా కొట్టేసినట్లున్నాడు తమన్.
ఇక, మరి కొద్ది రోజులు మాత్రమే వుంది ‘బ్రో’ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు. ఇంతవరకూ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలన్నీ ఓ ఎత్తు. తాజాగా వదిలిన ‘బ్రో’ థీమ్ సాంగ్ ఇంకో ఎత్తు.
సినిమాపై అంచనాల్ని వేరే లెవల్‌కి తీసుకెళ్లింది. ‘వినోదియ సితం’ రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాని సముద్రఖని తెలుగులో తెరకెక్కించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనా సహాయమందించారు.
పవన్ కళ్యాణ్‌తో పాటూ సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్లు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ శుక్రవారం (జూలై 28)న ప్రేక్షకుల ముందుకు రానుంది ‘బ్రో’.
తాజా వార్తలు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్‌లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!
- ఖతార్ బార్డర్ ద్వారా ప్రయాణంపై ఎంబసీ సూచనలు..!!
- భారీ వర్షాలు.. ఆన్లైన్ పరిహార సర్వీసుకు ఆమోదం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 663 నిషిద్ధ వస్తువులు సీజ్..!!
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్‌ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!









