శ్రీలీల దుమ్ము దులిపేయనుందిగా.!
- July 25, 2023
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా శ్రీలీల చెలామణీ అవుతోన్న సంగతి తెలిసిందే. శ్రీలీలకు అందంతో పాటూ, యాక్టింగ్ టాలెంట్ కూడా ఎక్కువే. ఏదో తెలియని ఎట్రాక్షన్. అదే టాలీవుడ్ మేకర్లను అయస్కాంతంలా ఆకర్షించేసింది.
ఓ మోస్తరు యంగ్ హీరోలతో పాటూ, స్టార్ హీరోలు సైతం శ్రీలీలనే తమ స్క్రీన్ పాట్నర్గా ఎంచుకోవడానికి ఇదే కారణం. ఇక శ్రీలీల మంచి డాన్సర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తొలి సినిమా ‘పెళ్లి సందడి’కి ఆమె డాన్సులే స్పెషల్ అట్రాక్షన్.
ఇక, మాస్ రాజా రవితేజ పక్కన మాస్ డాన్సులిరగదీసి మాస్ రాజానే డామినేట్ చేసేసిందీ అందాల తెలుగమ్మాయ్. ఇక, శ్రీలీల చేతిలో ప్రస్తుతం వున్న ప్రాజెక్టుల్లో డాన్సింగ్ స్టార్స్ కూడా వున్నారు.
నితిన్ మంచి డాన్సర్.. నితిన్‌తో వక్కంతం వంశీ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఇంకేముంది ఈ ఇద్దరి కాంబోలో రాబోయే సాంగ్స్ ఏ లెవల్లో వుండబోతున్నాయో ఊహించుకోవడమే కష్టం.
అంతేనా.! మరో డాన్సింగ్ స్టార్ రామ్ పోతినేని.. రామ్‌తో శ్రీలీల చేసే డాన్సింగ్ ఫెస్టివల్ మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. అనే రేంజ్లో వుండబోతున్నాయట. ఇంకేముంది డాన్స్ లవర్స్‌కి శ్రీలీల ఫ్యూచర్ ప్రాజెక్లులు పండగే పండగ.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







