రెండో ప్రతినిధిగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నారా రోహిత్.!
- July 25, 2023
అప్పుడెప్పుడో ‘ప్రతినిధి’ అనే సినిమా గురించి వినే వుంటారు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న నారా రోహిత్ తొలి నాళ్లలో చేసిన సినిమా ఇది. అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా ఇది.
మీడియా బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ సినిమా అప్పట్లో చాలా మందిని ఆలోచింపచేసింది. ఆ సినిమాకి ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ రాబోతోంది. నారా రోహిత్ ఈ మధ్య సినిమాలకు దూరంగా వుంటున్న సంగతి తెలిసిందే.
లాంగ్ గ్యాప్ తర్వాత ‘ప్రతినిధి 2’ సినిమాని అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. న్యూస్ పేపర్లతో డిజైన్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే, ఇది కూడా మీడియాని ఎండకట్టే థీమ్‌తో రాబోతోందని అర్ధమవుతోంది.
అప్‌కమింగ్ ఎలక్షన్స్‌ని టార్గెట్ చేసుకునే ఈ సినిమాని వదులుతున్నట్లుగా తెలుస్తోంది.ఫస్ట్‌లుక్‌తో పాటూ, రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్
.
2024 జనవరి 25న ‘ప్రతినిధి 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నట్లు టీవీ 5 ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మూర్తి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండడం విశేషం.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్‌ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









