జాన్వీ కపూర్ రూటే సెపరేటు.!
- July 25, 2023
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌తో అంత వీజీ కాదు. సోషల్ మీడియాకి వచ్చేసరికి గ్లామర్ డాళ్‌గా పాపులర్ అయినా సినిమాల విషయానికి వస్తే జాన్వీ కపూర్ పూర్తి భిన్నం.
తొలి సినిమా నుంచీ జాన్వీ ఎంచుకునే సినిమాల లిస్టు తీస్తే, జాన్వీలో ఇంత మెచ్చూరిటీ ఎలా వచ్చిందబ్బా.! భలే కూతుర్ని కని వెళ్లిపోయిందే శ్రీదేవి.. అని ప్రతిక్షణం అనిపించక మానదు.
ఆయా కథలు జాన్వీ కోసం పుట్టాయా.? లేక ఆయా కథల కోసమే జాన్వీ కపూర్ పుట్టిందా.? అనిపిస్తుంటాయ్ జాన్వీ నటించిన కొన్ని సినిమాలు చూస్తే.
అలా ఆయా సినిమాల్లో తన స్పేస్‌ని క్రియేట్ చేసుకుంటుంది జాన్వీ కపూర్. ఎక్కడా వల్గారిటీకీ, గ్లామర్‌కీ కూడా చోటివ్వకుండా, ఆడియన్స్ అటెన్షన్‌ని క్యారీ చేయడంలో జాన్వీ తనదైన టాలెంట్ చూపిస్తుంటుంది.
తాజాగా ‘బవాల్’ అనే సినిమాలో జాన్వీ కపూర్ నటించింది. నిజంగా ఎంతో అద్భుతమైన ఫీల్ ఇచ్చింది ఈ సినిమా. రెండో ప్రపంచ యుద్ధం అనే కాన్సెప్ట్‌ని తీసుకుని, కథ అల్లుకున్న వైనం, ఆ కథను కొత్తగా పెళ్లయిన ఇద్దరు భార్య భర్తల కథకీ, స్కూలు పిల్లలకీ కనెక్ట్ చేసిన విధానం చాలా చక్కగా కుదిరింది. ఎంతో హృద్యంగా కథనాన్ని నడిపించిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.
వరుణ్ దావన్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కిన ‘బవాల్’, తాజాగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ విశేషంగా ఆకట్టుకుంటోంది ‘బవాల్’. మూవీ.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







