రమదాన్ శుభాకాంక్షలు స్వీకరించిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్

- June 23, 2015 , by Maagulf
రమదాన్ శుభాకాంక్షలు స్వీకరించిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్

రమదాన్ శుభాకాంక్షలు తెలుపడానికి విచ్చేసిన తన శ్రేయోభిలాషులను దుబాయి  ఉపాధ్యక్షులు, ప్రధానమంత్రి ఐన హిజ్ రాయల్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, తన జాబీల్ పాలస్లో కలుసుకున్నారు.

ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ సభ్యులు, మంత్రులు, సేనియర్ ప్రభుత్వ అధికారులు మరియు ప్రజల అభినందనలను ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రమదాన్ ప్రార్ధనలు ఇంకా ఆర్తులు, వృద్ధులు, రోగులు మరియు అనాధల పట్ల ఆదరణ కలిగియుండడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

సందర్శకులు కూడా, తమకు ప్రశాంత జీవనానికి, అనాధలు, పిల్లల సంక్షేమానికి సరైన చర్యలు తీసుకుంటున్న ప్రధాని దయకు అనేక కృతజ్ఞతలు తెలియచేశారు.

 

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com