ఖరీదైన కారు కొనుగోలు చేసిన హీరో నిఖిల్

- June 23, 2015 , by Maagulf
ఖరీదైన కారు కొనుగోలు చేసిన హీరో నిఖిల్

తెలుగు హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెలుతున్నాడు. వరుసగా మూడు విజయాలు సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో మంచి పోష్ మీద ఉన్నాడు. నిఖిల్ నటించిన స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య బాక్సాఫీసు వద్ద మంచి విజయాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వరుస సక్సెస్ లతో నిఖిల్ తన స్టార్ ఇమేజ్ పెంచుకోవడంతో పాటు డబ్బు కూడా బాగానే వెనకేసాడు. దీంతో తాను ఎప్పటి నుండో కొనాలని ఆశ పడుతున్న కారును కొనుగోలు చేసాడు. సోమవారం నిఖిల్ తన డ్రీమ్ కార్ సొంతం చేసుకున్నాడు. మెర్సిడెజ్ బెంజ్ సిఎల్ఏ క్లాస్ స్పోర్ట్స్ మోడల్ కారు కొనుగోలు చేసాడు. తన రెడ్ బీస్ట్ తో ఇలా ఫోటోకు ఫోజు ఇచ్చాడు. ఈ కారు ఖరీదో హైదరాబాద్ లో ఆన్ రోడ్ రూ. 43 లక్షలు. కంగ్రాట్స్ నిఖిల్. నిఖిల్ ప్రస్తుతం 'శంకరాభరణం' అనే క్రైం కామెడీ చిత్రంలో నటిస్తున్నాడు. న వెంకట్ సమర్పణలో ఎం.వీ.వీ. సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయ్ నందనవనమ్ దర్శకుడు. 'గీతాంజలి' వంటి విజయం తర్వాత ఎంవీవీ సినిమా సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఇది. పుణేకి 60 కిలోమీటర్ల దూరంలోని బోర్, నగరి, వాయ్ గ్రామాల్లో ఈ చిత్రం షూటింగ్ చేస్తున్నారు. ఈ నెల 15న మొదలైన ఈ షెడ్యూల్ 25 వరకూ సాగుతుంది. రావు రమేశ్, సత్యం రాజేశ్, షకలక శంకర్, సుజయ్ మిశ్రా, పిటూబాష్ త్రిపాఠి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, ఎడిటింగ్: నవీన్ నూలి, రచనా సహకారం: వెంకటేశ్ కిలారు, భవాని ప్రసాద్, డ్యాన్స్ మాస్టర్స్: శేఖర్-శివ, ఫైట్ మాస్టర్: విజయ్, మేనేజర్స్: నాగు-రవి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి, సహ నిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరావ్, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు: కోన వెంకట్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com