శుద్రపూజల పేరిట మోసం. 7 మందికి జైలు శిక్ష, 50,000 దిర్హామ్ల జరిమానా
- July 27, 2023
యూఏఈ: శుద్రపూజల పేరిట పలువురిని మోసగించిన ఏడుగురికి యూఏఈలో ఆరు నెలల జైలు శిక్ష విధించారు. వారికి 50,000 దిర్హామ్ల జరిమానా కూడా విధించారు. యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ బుధవారం కేసు వివరాలను వెల్లడించింది. నిందితుల ముఠాలోని సభ్యులు తమకు జిన్ రాజుల శక్తి(అదృశ్య శక్తులు) ఉన్నాయని పలువురిని నమ్మించారు. ప్రజలకు ఆరోగ్య సమస్యలను దూరం చేసే అనేక శక్తులు ఉన్నాయని నమ్మించి పలువురిని మోసం చేశారు. చేతబడి చేయడం, మోసం, శుద్రపూజల వంటి ఆరోపణలపై ఏడుగురిని కోర్టుకు తరలించారు. తరువాత వారికి 6 నెలల జైలు శిక్ష, జ్యుడీషియల్ ఫీజుతో పాటు 50,000 దిర్హామ్ జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. నేరాలు, జరిమానాల చట్టాన్ని జారీ చేసే ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 31 2021 ప్రకారం, చేతబడి మరియు మోసం భారీ జరిమానాలతో శిక్షించదగిన నేరాలు అని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పునరుద్ఘాటించింది. చేతబడికి సంబంధించిన ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాల గురించి తెలిస్తే తమకు తెలియజేయాలని అధికారులు నివాసితులకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







