ఆ ప్రాంతాల్లో వ్యర్థాలను డంపింగ్ చేస్తే OMR1,000 జరిమానా
- July 27, 2023
మస్కట్: నిర్దేశించని ప్రాంతాలలో వ్యర్థాలను డంప్ చేయడం, పర్యావరణానికి హాని కలిగించడం వంటి ఉల్లంఘనలకు పాల్పడే కాంట్రాక్టర్లు, లారీ డ్రైవర్లకు OMR1,000 వరకు భారీ జరిమానా విధించే అవకాశం ఉందని మస్కట్ మునిసిపాలిటీ హెచ్చరించింది. పర్యావరణానికి హాని కలిగించే వారి నుండి పర్యావరణాన్ని రక్షించడానికి మున్సిపల్ ఆదేశాలు, చట్టాలు బలంగా ఉన్నాయని గుర్తుచేసింది. రక్షిత ఆరోగ్యం, పరిపాలనా నిర్ణయం 2017/55పై స్థానిక ఆర్డర్ 1/2006లోని ఆర్టికల్ 11 ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించనున్నట్టు ప్రకటించింది. మునిసిపల్ లైసెన్సులను నియంత్రించే విధానాలు కాంట్రాక్టర్లు లేదా ఇంటి యజమానిని నిర్మాణం పూర్తయిన తర్వాత సైట్ను క్లీన్ చేయాలని సూచించింది. రాయల్ డిక్రీ నం. 38/2015 ద్వారా జారీ చేయబడిన మస్కట్ మునిసిపాలిటీ చట్టాన్ని ఉల్లంఘించినందుకు పరిపాలనాపరమైన ఆంక్షల కోసం ప్రత్యేకంగా పరిపాలనా నిర్ణయం నెం. 55/2017 తీసుకొచ్చినట్టు తెలిపింది. బహిరంగ ప్రదేశాలలో లేదా వాడీల్లో వ్యర్థాలను విసిరే వారికి OMR1,000 జరిమానా విధించబడుతుంది. ఉల్లంఘటనలు పునరావృతమైతే, జరిమానా రెట్టింపు అవుతుందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







