తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. శుక్ర, శనివారాల్లో కూడా సెలవు ..
- July 27, 2023
తెలంగాణ: తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులపై నీరుచేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. హైదరాబాద్ (Hyderabad) సహా చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల దెబ్బకు జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది.
వర్షాల కారణంగా ఇప్పటికే రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం వరకు వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో పాటు, శుక్రవారంసైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో తెలంగాణలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం రేపు (శుక్రవారం) కూడా సెలవు ప్రకటించింది. భారీ, అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ సెలవు ప్రకటించినట్లు తెలిపింది.
శుక్రవారంసైతం విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు శనివారం మొహర్రం, ఆ తరువాత ఆదివారం ఇలా విద్యా సంస్థలకు వరుసగా మరో మూడు రోజులు సెలవులు వచ్చినట్లయింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు రెండు రోజులు అంటే బుధవారం (జూలై 26), గురువారం (జూలై 27) ప్రభుత్వం హాలిడేస్ ఇచ్చిన విషయం తెలిసిందే. భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు.
కాగా.. వర్షాల కారణంగా గత గురువారం, శుక్రవారం, శనివారం విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ఇచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం, మంగళవారం మాత్రమే స్కూళ్లు, కాలేజీలు కొనసాగాయి. బుధవారం, గురువారం ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలువులు ఇచ్చింది. తాజాగా శుక్రవారంసైతం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శనివారం కూడా మొహర్రం సెలవు ఉండటంతో తిరిగి సోమవారం పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







