అబుధాబిలో బ్యూటీ సెలూన్లు, ఫిట్‌నెస్ సెంటర్లలో తనిఖీలు
- July 27, 2023
అబుధాబి: మహిళల బ్యూటీ సెలూన్లు, ఫిట్‌నెస్ సెంటర్‌లు ఆరోగ్యం, భద్రత మరియు పరిశుభ్రత నియమాలను పాటిస్తున్నాయో లేదో నిర్ధారించడానికి స్థానిక అధికారులు సమగ్ర తనిఖీ డ్రైవ్‌ను చేపట్టారు. కమ్యూనిటీ సభ్యుల శ్రేయస్సు కోసం ఉత్తమ పద్ధతులను అనుసరించడం ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి అబుధాబి సిటీ మునిసిపాలిటీ ఈ తనిఖీలను నిర్వహించింది. మదీనాట్ జాయెద్ మునిసిపాలిటీ సెంటర్ నుండి ఇన్‌స్పెక్టర్లు తనిఖీల్లో పాల్గొన్నారు. మహ్మద్ బిన్ జాయెద్ సిటీ, అల్ రహా బీచ్, షాఖ్‌బౌట్ సిటీ మరియు రబ్దాన్ సిటీ పాంతాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాస్మెటిక్ మెటీరియల్స్, ఆరోగ్య అవసరాలకు ఉపయోగించే ఉత్పత్తులను పరిశీలించారు. ఉపయోగించిన సౌందర్య సాధనాలు, తయారీ పద్ధతులను ఇన్‌స్పెక్టర్లు పరిశీలించారు. సేవలను అందించేటప్పుడు యూనిఫాం ధరించమని ఉద్యోగులకు సూచించారు. సెలూన్లు, బ్యూటీ మరియు ఫిట్‌నెస్ కేంద్రాల శుభ్రతపై అనేక నిర్వాహకులకు సూచనలు చేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







