దేష్ తీవ్రవాదులకు మద్దతు పలికిన ఇరాకీ మహిళకు శిక్ష
- May 16, 2016
మనామా: సౌదీ రాజధాని రియాధ్ లో ఒక కోర్టు ఒక ఇరాకీ మహిళ ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆ మహిళ దేష్ తీవ్రవాద సమూహంకు మద్దతు పలికినందుకు ఈ శిక్ష పడిన ప్రతివాది వీడియో సంక్షిప్త చిత్రాన్ని సామాజిక మీడియా నెట్ వర్కు ద్వారా ముద్దాయి పలువురికి పంపబడినట్లు కనుగొనబడింది. దేష్ తీవ్రవాదాన్ని ప్రోత్సహించడానికి అనేక మంది మహిళలకు ఆమె దానిని పంపినట్లు రుజువయ్యైంది. అంతేకాక ఆమె తన భర్తని పోరాడటానికి ప్రోత్సహించే విధంగా తన భర్తకు ఆడియో రికార్డింగ్ సందేశం పంపించింది .అమర్యాదకరమైన వివరణలు ఉపయోగించి ఆ మహిళ పబ్లిక్ ఆర్డర్ మరియు అవమానకరమైన రీతిలో సౌదీ అరేబియాని అణగదొక్కాలని ప్రయత్నం చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తినట్లు సౌదీ రోజువారీ అల వతన్ సోమవారం వెల్లడించింది.ప్రతివాది ఆమె భర్త ఇంటి వద్ద ఉంచిన రెండు ల్యాప్టాప్లు సమాచారం మరియు వాటిలో దాచి నిల్వ సమాచారం అన్ని వివరాలు తొలగించడానికి ప్రయత్నించిందని తద్వారా పరిశోధకులని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిచిందని తెలిపింది. చట్టవిరుద్ధంగా ఇరాక్ వెళ్ళడానికి తన భర్తను ప్రోత్సాహించడమే కాక చట్టాన్ని ఉల్లంఘించైనా తన భర్త పై ప్రభుత్వానికి పిర్యాదు చేయకపోవడం మరియు ఆమె సోదరుడు ఇరాక్ లో ఉండి ఈ ప్రయత్నం తన భర్త సమన్వయం ఉన్నప్పుడు భద్రతా అధికారులకు తెలియచేయనందుకు ఆ మహిళ జైలుశిక్షకు అర్హురాలని రోజువారీ అల వతన్ లో తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







