19ఏళ్ల భారతీయ యువతి పై పాకిస్థాన్ కు చెందిన వ్యక్తి లైంగిక వేధింపు
- May 16, 2016
తన అవసరాన్ని అవకాశంగా తీసుకొని ఓ 19ఏళ్ల భారతీయ యువతి (గృహిణి)పై పాకిస్థాన్ కు చెందిన వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తప్పుడుగా ప్రవర్తించాడు. ఈ ఘటన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో చోటుచేసుకుంది. ఈ మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్లారు. దుబాయ్ లోని రషిదియా ప్రాంతంలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన పాకిస్థాన్ మేనేజర్ ఉన్నాడు. గృహిణిగా పనిచేస్తున్న భారతీయ యువతి తనకు కంప్యూటర్ ఓరియెంటెడ్ జాబ్ కోసం గత కొద్దికాలంగా ప్రయత్నిస్తోంది.అయితే, ఓ ఫోన్ కాల్ ద్వారా మాట్లాడిన పాకిస్థాన్ మేనేజర్.. తన కంపెనీలో సెక్రటరీ ఉద్యోగం ఉందని ఇంటర్వ్యూకు హాజరుకావాలని, అక్కడే కంప్యూటర్ కు సంబంధించిన శిక్షణ కూడా ఇస్తామని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన యువతి అతడు చెప్పిన అడ్రస్ కు వెళ్లాక అది కార్యాలయం కాదని, అతడి ఇళ్లు అని తెలిసింది. ఆ వెంటనే ఏవో మాయమాటలు చెప్పి మెల్లగా ఆమెను తన బెడ్ రూంలోకి తీసుకెళ్లిన అతడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై మే 26న తీర్పు వెలువరించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







